సుప్రీం సంచలన తీర్పు: హైకోర్టు జడ్జికి 6 నెలల జైలు శిక్ష
- Swamy Veera
- May 9, 2017
- 1 min read
దేశ చరిత్రలోనే ఒక జడ్జికి ఆరునెలల పాటు జైలు శిక్ష విధించింది సుప్రీం కోర్టు. కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డాడని పేర్కొంటూ ఆయనకు 6నెలలు జైలు శిక్ష విధించింది అత్యున్నత న్యాయస్థానం. వెంటనే కర్ణన్‌ను అరెస్టు చేయాలని కోల్‌కతా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కర్ణన్ ఎలాంటి ప్రకటనలు చేసినా వాటని మీడియా హైలైట్ చేయకుండా ఉండేలా మీడియాపై ఆంక్షలు విధించింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్‌తో సహా ఏడుగురు జడ్జీలకు ఎస్సీ, ఎస్టీ,అత్యాచార నిరోధక చట్టం కింద ఐదేళ్లు కఠినకారాగా శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు కర్ణన్. దీంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది దేశ అత్యున్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా 20 మంది జడ్జిలు అవినీతికి పాల్పడ్డారని వారిపై విచారణ జరిపించాలని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు జస్టిస్ కర్ణన్. దీంతో ఆయన్ను మద్రాస్ హైకోర్టు నుంచి కోల్ కతా హైకోర్టుకు బదిలీ చేశారు. తను దళితుడినైనందువల్లే తనపై కక్షసాధింపు చర్యలకు దిగారని జస్టిస్ కర్ణన్ ఆరోపించారు.
Recent Posts
See Allనా కోసం నీవు నీ కోసం నేను కాదు మనం పని చేదం నేను బాగుపడుతా నేను నా కోసం నవ్వు కూడా నా కోసమే 10మందిని తొక్కుతా నేను ఎదుగుతా మోసం...
న్యూ ఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ మరోసారి తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి మంగళవారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ...