మ్యూజియంగా మారనున్న గాంధీజీ చదివిన స్కూల్
- నమస్తే తెలంగాణ
- May 6, 2017
- 1 min read
రాజ్‌కోట్

: ఎంతో కళాత్మకంగా, పటిష్ఠంగా చిత్రంలో కనిపిస్తున్న ఈ పురాతన భవనం భారత జాతి పిత మహాత్మాగాంధీ విద్యాభ్యాసం చేసిన పాఠశాల. అనేక మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ స్కూల్ 164 ఏండ్ల తర్వాత మూతపడుతున్నది. దీనిని మ్యూజియంగా మార్చేందుకు గుజరాత్ సర్కార్ చర్యలు చేపడుతున్నది. గుజరాతీ మీడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ బడి నడిచింది. తన 18వ ఏట గాంధీజీ 1887లో ఈ స్కూల్‌లో చదివారు. ఆంగ్లే యుల పాలనలో రాజ్‌కోట్‌లో 1875లో జునాగఢ్ నవాబు నిర్మించిన ఈ పాఠశాలను తొలుత అల్‌ఫ్రెడ్ హైస్కూల్‌గా పిలిచేవారు. అనంతరం మోహన్‌దాస్ గాంధీ హైస్కూల్‌గా పేరుగాంచింది. ఆ రోజుల్లో సౌరాష్ట్ర ప్రాంతంలో తొలి ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఇదే కావడం విశేషం.
Recent Posts
See Allనా కోసం నీవు నీ కోసం నేను కాదు మనం పని చేదం నేను బాగుపడుతా నేను నా కోసం నవ్వు కూడా నా కోసమే 10మందిని తొక్కుతా నేను ఎదుగుతా మోసం...
న్యూ ఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ మరోసారి తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి మంగళవారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ...
దేశ చరిత్రలోనే ఒక జడ్జికి ఆరునెలల పాటు జైలు శిక్ష విధించింది సుప్రీం కోర్టు. కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్ కోర్టు...