top of page
Search

బీజేపీకి ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని సౌరవ్ భరద్వాజ్ సవాల్....

  • Andrajothi
  • May 9, 2017
  • 1 min read

న్యూ ఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ మరోసారి తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి మంగళవారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆప్ ఎమ్మెల్యే సౌరవ్ భరద్వాజ్ ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ప్రదర్శన ఇచ్చారు. మిషన్ ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో వివరించారు.

సౌరవ్ భరద్వాజ్ సభకు ఈవీఎం మిషన్‌తో పాటు కంట్రోల్ యూనిట్‌ను తీసుకువచ్చారు. తొలుత అన్ని పార్టీలకు ఒక్కో ఓటు వేసి మిషన్లు సరిగా పనిచేస్తున్నాయో, లేదో, సభ్యులకు చూపారు. అనంతరం మరోసారి అదేవిధంగా ఈవీఎం మిషన్ల పనితీరు చెక్‌చేసి చూపించారు. పనితీరు సరిగ్గా ఉందని సభ్యులందరితో కలిసి నిర్ధారించుకున్న తరువాత వాటి ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో వివరించారు. ట్యాంపరింగ్ చేయాలనుకున్న పార్టీలు కానీ, వ్యక్తులు కానీ ఓ సీక్రెట్ కోడ్‌ను వినియోగిస్తారని తెలిపారు. కోడ్ నంబర్లు పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా మారుతాయని స్పష్టం చేశారు. అనంతరం పోలింగ్ జరిగే విధానంలో కోడ్ నెంబర్ ఎలా జొప్పిస్తారనే విషయాన్ని చూపించారు. ఈ తరుణంలో ఏ పార్టీ అయితే విజయం సాధించాలని నిర్దేశిస్తారో అదే పార్టీ గెలుస్తుందని రుజువు చేసి చూపించారు.

ఈవీఎం ట్యాంపరింగ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందని సౌరవ్ భరద్వాజ్ స్పష్టం చేశారు. విదేశాలుసైతం ఈవీఎంలను ఉపయోగించడం మానేశాయని తెలిపారు. విదేశీ టెక్నాలజీని ఉపయోగించి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అపహాస్యం చేయడం ఎందుకని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో మూడు గంటలపాటు ఈవీఎంలను తమకు అప్పగిస్తే బీజేపీకి ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని సౌరవ్ భరద్వాజ్ సవాల్ విసిరారు.


 
 
 

Recent Posts

See All
ఈ ప్రపంచంలోన్ని 5 సత్యాలు

నా కోసం నీవు నీ కోసం నేను కాదు మనం పని చేదం నేను బాగుపడుతా నేను నా కోసం నవ్వు కూడా నా కోసమే 10మందిని తొక్కుతా నేను ఎదుగుతా మోసం...

 
 
 
సుప్రీం సంచ‌ల‌న తీర్పు: హైకోర్టు జడ్జికి 6 నెలల జైలు శిక్ష

దేశ చరిత్రలోనే ఒక‌ జ‌డ్జికి ఆరునెల‌ల పాటు జైలు శిక్ష విధించింది సుప్రీం కోర్టు. కోల్‌క‌తా హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ క‌ర్ణ‌న్ కోర్టు...

 
 
 
Featured Posts
Check back soon
Once posts are published, you’ll see them here.
Recent Posts
Archive
Search By Tags
Follow Us
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
  • Facebook - White Circle
  • YouTube - White Circle
  • Google+ - White Circle

© 2023 by AmmuVeeraSwamy.  Proudly created with Wix.com

bottom of page